తనను సలహాదారుగా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఇటీవల సినీ నటుడు అలీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అలీ తన సతీమణితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చాలా కాలంగా ప్రభుత్వం నుంచి శుభవార్త వస్తుందని ఆశించిన అలీ ఇప్పుడు రెండేళ్ల పదవీకాలంతో ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. తమ కూతురు పెళ్లికి కూడా సీఎం జగన్‌ని అలీ దంపతులు ఆహ్వానించారు
AP CM Jagan : ఏపీ సీఎం జగన్‌ని కలిసిన సినీ నటుడు అలీ దంపతులు

YSRCP