Site icon HashtagU Telugu

TS High Court: ఆలేరు ఎమ్మెల్యే కు హైకోర్టు షాక్, 10 వేల జరిమానా!

New High Court

ఎన్నికల ముగింట అధికార పార్టీకి గట్టి దెబ్బలే తగలుతున్నాయి. ఇప్పటికే మైనంపల్లి, కుంభం అనిల్ లాంటి నేతలు కాంగ్రెస్ లో చేరడం ఏమాత్రం మింగుడుపడటం లేదు. తాజాగా మరోసారి బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు 10 వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టుకు పిటీషన్ అందింది. ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు.

అయితే 2018 కి చెందిన కేసులో ఇప్పటివరకూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేయక పోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గొంగిడి సునీతకు  10 వేల రూపాయల జరిమానా విధించింది. అక్టోబరు 3 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను అక్టోబర్ 3 కు హైకోర్టు వాయిదా వేసింది.

Also Read: TCongress: నాయకత్వ లేమితో బీజేపీ బేజార్, కీలక నేతల చూపు కాంగ్రెస్ వైపు!