Site icon HashtagU Telugu

TTD Devotees: తిరుమల న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. గుంపులుగా వెళ్లాల‌ని సూచ‌న‌..!

TTD Devotees

Tirumala Srivari Income In 2022 Is Rs.1,320 Crores Ttd

TTD Devotees: తిరుమ‌ల న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు తిరుపతి అటవీ శాఖ అధికారి సతీష్ కూమార్ కీల‌క సూచ‌న‌లు చేశారు. తిరుమల‌ నడకదారి (TTD Devotees)లో మార్చి నెలలో ఇప్పటివరకు ఐదు సార్లు చిరుత కదలికలు కనిపించాయని ఆయ‌న తెలిపారు. న‌డ‌క‌దారిలో ఏడో మైలు నుంచి నరసింహా స్వామి ఆల‌యం వరకు భక్తులు పుట్ పాత్ నుంచి బయటకు రాకుండా నడవాలని సూచించారు. భక్తులు నడకదారిలో బృందాలుగా వెళ్లాలని సూచించారు. అటు అటవీ శాఖతోపాటు టిటిడి ఫారెస్ట్ విజిలెన్స్ శాఖలు సంయుక్తంగా భక్తుల రక్షణ కోసం బృందాలుగా గస్తీ కాస్తున్నాయ‌న్నారు.

నడక దారిలో భక్తులు రక్షణ కోసం ఇంటర్నల్ కమిటీ ఇచ్చే నివేదిక ప్ర‌కారం అందరూ పాసులతో పాటు కంచ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలపై నివేదిక వస్తానే పనులు ప్రారంభిస్తారని తెలిపారు. శేషాచల అటవీ ప్రాంతంలో తాగునీటి కొరత ఇబ్బంది లేదు. అవసరమైతే సోలార్ మోటార్స్ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. ఏనుగుల సంచారంపై పూర్తిస్తాయిలో వాటి వివరాలు తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నామ‌న్నారు. రాత్రిపూట పనిచేసే కెమెరాలతో డ్రోన్ నడిచే విధంగా డ్రోన్ కెమెరా తెప్పించామ‌ని పేర్కొన్నారు. నడక దారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామ‌ని, ఎలాంటి భయాందోళన లేకుండా పుట్ పాత్ దాటకుండా భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని అధికారి పేర్కొన్నారు.

Also Read: Rain Tax: కెనడాలో ప్రజలపై ‘రెయిన్ ట్యాక్స్’.. కార‌ణ‌మిదే..?

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ పేర్కొంది. గురువారం శ్రీవారిని 65,992 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా టీటీడీ ప్రకటించింది.

We’re now on WhatsApp : Click to Join