Site icon HashtagU Telugu

Akshay Tritiya 2023: అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?

Akshay Tritiya 2023

Akshay Tritiya 2023

అక్షయ తృతీయ వచ్చింది అంటే చాలా భారతదేశంలో హిందు మహిళలు పెద్ద ఎత్తున బంగారు షాపులకు వెళ్లి బంగారం ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ 22న వచ్చింది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిందే..

కాగా ఏప్రిల్ 1 నుంచి బంగారు వస్తువులు, ఆభరణాల కొనుగోలుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్ ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్
HUID లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించడాన్ని నిషేధించింది. HUID హాల్‌మార్క్ 3 మార్కులను కలిగి ఉంటుంది. BIS లోగో, బంగారం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి. ఒక్కో బంగారు వస్తువు లేదా ఆభరణానికి ఒక్కో విశిష్టమైన ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ ఉంటుంది. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్.

ప్రతి బంగారు వస్తువు, ఆభరణంపైనా BIS లోగో ఉంటుంది. అలాగే ఆ ఆభరణం BIS అధీకృత ల్యాబ్‌లో పరీక్షించి ధ్రువీకరించినట్లు అర్థం. కొనుగోలుదారులు బంగారు ఆభరణంపైనా ఈ లోగో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. భారతదేశంలోని బంగారు వస్తువులు, ఆభరణాల స్వచ్ఛతను ధ్రువీకరించే ఏకైక సంస్థ BIS. ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారాన్ని ధ్రువీకరించే మరో గుర్తు ఫైన్‌నెస్ నంబర్, క్యారెట్. వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కూడిన బంగారు మిశ్రమాలలో నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 24 క్యారెట్ల బంగారం చాలా మృదువైనది. కాబట్టి ఆభరణాల కోసం ఇతర లోహాలను దీనికి కలుపుతారు. 916 అనేది ఫైన్‌నెస్ నంబర్. 22 క్యారెట్ల బంగారానికి మరో పదం. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బరువు ఉంటే అందులో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ HUID బంగారు ఆభరణాలను అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్‌లో మాన్యువల్‌గా ప్రత్యేక నంబర్‌తో స్టాంప్ చేస్తారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేకమైన HUID ఉంటుంది.