Naga Chaitanya: ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌!

‘మనం’ లాంటి ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్‌ల కలయికలో రాబోతున్న మరో చిత్రం ‘థాంక్యూ’.

Published By: HashtagU Telugu Desk
Thank You

Thank You

‘మనం’ లాంటి ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్‌ల కలయికలో రాబోతున్న మరో చిత్రం ‘థాంక్యూ’. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన శ్రీవెంకటేళ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మాణంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు. ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య కూల్‌అం‌డ్‌ స్టయిలిష్‌ లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ‘నాగచైతన్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయే ఈ సినిమా వుంటుందని, లెజండరీ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్‌ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌ నూలి ఎడిటర్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలోనే తెలియజేస్తారు.

  Last Updated: 16 May 2022, 12:20 PM IST