Censor Board Member : సెన్సార్ బోర్డు మెంబర్‌గా అక్కల సుధాకర్ నియామ‌కం

సెన్సార్ బోర్డు మెంబర్‌ అక్కల సుధాకర్ నియ‌మితులైయ్యారు. ఈ సంద‌ర్భంగా అక్క‌ల సుధాక‌ర్ కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి,

  • Written By:
  • Updated On - December 30, 2023 / 10:21 PM IST

సెన్సార్ బోర్డు మెంబర్‌ అక్కల సుధాకర్ నియ‌మితులైయ్యారు. ఈ సంద‌ర్భంగా అక్క‌ల సుధాక‌ర్ కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యులు ల‌క్ష్మ‌ణ్‌ల‌ను మార్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అక్కల సుధాకర్ ను హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు సునీల్ నారంగ్, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మరియు ప్రముఖ ప్రొడ్యూసర్ అభిషేక్ నామ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు సుధాకర్‌కి శుభాకాంక్షలు తెలిపి నూతన బాధ్య‌తలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. సెన్సార్ బోర్డు మెంబ‌ర్‌గా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, స‌మాజహితం కోసం ఉప‌యోగ‌ప‌డే వాటిని అందించేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని అక్క‌ల సుధాక‌ర్ తెలిపారు.

Also Read:  CM Revanth Reddy: త్వరలో రేవంత్ చేతుల మీదుగా 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం