Site icon HashtagU Telugu

UP Elections: యూపీలో ర‌చ్చ లేపుతున్న.. అఖిలేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న..!

Akhilesh Yadav

Akhilesh Yadav

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో, ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రెండు ద‌శ‌లు ఎన్నిక‌ల పోలీంగ్ ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే యూపీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో అన్ని పార్టీలు అక్క‌డి ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నాయి. ఈ క్ర‌మంలో యూపీలో బీజేపీకి గ‌ట్టి పోటీ ఇస్తున్న స‌మాజ్‌వాది పార్టీ తాజాగా ప్ర‌క‌టించిన హామీ అక్క‌డి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నిక‌ల ప్ర‌చార నేప‌ధ్యంలో అక్క‌డ ర్యాలీలో పాల్గొన్న స‌మాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్, ఈసారి యూపీలో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే, ఐదేళ్ళ‌పాటు ఉచిత రేష‌న్ ఇస్తామ‌ని, అలాగే పేద‌ల‌కు కిలో నెయ్యి ఇస్తామ‌ని సంచ‌ల‌న హామీ ప్ర‌క‌టించారు. దీంతో అఖిలేష్ యాద‌వ్ చేసిన ప్ర‌క‌ట‌న పై అక్క‌డి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

Exit mobile version