Akhanda -2 : ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత క్రేజీ కాంబినేషన్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ , బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మూడు చిత్రాలు – ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ బాలకృష్ణకు హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలన్నీ భారీ విజయాలను సాధించడంతో, వీరిద్దరి కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ‘అఖండ’ సినిమా అయితే, బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలకొట్టింది. సినిమాకు వచ్చిన స్పందనతో థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు కూడా బద్దలయ్యాయి అంటే ఈ సినిమాకి కలిగిన మాస్ రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు, వీరి కాంబినేషన్‌లో నాల్గవ చిత్రం రాబోతుంది. ఈ రోజు గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంలో చిత్ర బృందం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ టైటిల్ పోస్టర్ చూస్తే ఇది ‘అఖండ’కి సీక్వెల్ అని స్పష్టమవుతోంది. ఈ సినిమాకు ‘అఖండ 2’ అనే టైటిల్ పెట్టారు.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు, బాలయ్య కుమార్తె ఎమ్. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు. బాలకృష్ణ , బోయపాటి ఇద్దరికీ ఇది మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కానుంది. ‘అఖండ’లో బాలకృష్ణ ప్రదర్శించిన తాండవం అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇప్పుడు ‘అఖండ 2’లో కూడా బాలయ్య తన సత్తా ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో అర్థమవుతుంది. టైటిల్ పోస్టర్ చాలా అద్భుతంగా, ఆధ్యాత్మికతతో నిండినట్లుగా ఉంది. పోస్టర్‌లో స్ఫటిక లింగంతో దైవికత ఉట్టిపడుతోంది. టైటిల్ కింద ఉన్న శక్తివంతమైన క్యాప్షన్ ‘తాండవం’ ప్రేక్షకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పోస్టర్‌లో రెండు డమరుకంలతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో గంభీరమైన హిమాలయాలు కూడా కనిపిస్తున్నాయి.
బాలకృష్ణను లార్జర్ దాన్ లైఫ్ పాత్రల్లో ప్రెజెంట్ చేయడంలో బోయపాటి శ్రీను మించిన దర్శకుడు లేరని చెప్పుకోవచ్చు. ‘అఖండ 2’కి కూడా బోయపాటి అదే రేంజ్‌లో, యూనివర్సల్ అప్పీల్ కలిగిన శక్తివంతమైన స్క్రిప్ట్‌తో బాలయ్యను కమాండింగ్ రోల్‌లో చూపించబోతున్నాడు. ఇది బాలకృష్ణ , బోయపాటి ఇద్దరికీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా, ఆడియన్స్‌లో భారీ అంచనాలను పెంచింది. ‘అఖండ’కి మ్యూజిక్ అందించిన ఎస్ థమన్ ఈ సీక్వెల్‌కి కూడా సంగీతం అందించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టైటిల్ పోస్టర్ చూస్తే, ఈ సినిమా పట్ల అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోవడం ప్రారంభించారు.
New Wine Shops : నేటి నుంచి ఏపీలో కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం