Telangana Assembly : సభను నడిపే విధానం ఇది కాదు: అక్బరుద్దీన్

ఆర్థిక చర్చ పై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదని అసహనం వ్యక్తం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Akbaruddin Owaisi-objected-to-the-economic-discussion-in-the-ts-assembly

Akbaruddin Owaisi-objected-to-the-economic-discussion-in-the-ts-assembly

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో అప్పుల గురించి చర్చ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశం పై చర్చ చేపడుతున్నారని సమాచారం ఇవ్వాలి. సభను నడిపే విధానం ఇది కాదు.. ప్రాధాన్యత అంశాలను ప్రభుత్వం చర్చకు తీసుకుంటుంది. ఆర్థిక చర్చ పై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదని అసహనం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ లో సైతం సభలో చర్చించాల్సిన అంశాల గురించి ముందే చెబుతారు. మీరు ఏ అంశం పై చేపడుతున్నారో తెలియదని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. సభ ఎన్ని రోజులు నడుపుతారో ఇంకా తెలియదన్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు తన మద్దతు తెలుపుతున్నానని వెల్లడించారు. అలాగే ముందు ముందు సమాచారం లోపం లేకుండా చూడండి అని స్పీకర్‌ను అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు.

అంతేకాక.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ముందుగా ఏ అంశం పై చర్చిస్తున్నారో సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ తరువాత మంత్రి శ్రీధర్ బాబు వారికి సమాధానం చెప్పారు. అప్పులపై చర్చ మీరు వద్దంటే ఆపేస్తారు. స్పీకర్ సారి చెప్పాలని కొందరూ డిమాండ్ చేస్తే.. మంత్రి శ్రీధర్ బాబు గట్టిగా అరిచారు. ఈ క్రమంలో అసెంబ్లీలో కాస్త ఉద్రికత్త వాతావరణం నెలకొంది.

Read Also: Chain snatching : రూట్ మార్చిన చైన్ స్నాచింగ్ ముఠా

 

 

 

 

  Last Updated: 19 Dec 2024, 04:07 PM IST