Site icon HashtagU Telugu

Benefits of Ajwani: కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే ఆకు డ్రింక్..పూర్తి వివరాలు ఇవే?

Ajwain Leaf

Ajwain Leaf

రుచికి,ఆరోగ్యానికి వాము పెట్టింది పేరు. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్కల్లో వాము మొక్క కూడా ఒకటి. ఈ మొక్క బాగా నువ్వు ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. అందుకే ఈ మొక్కను సంస్కృతంలో ఉగ్రగంధ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే వాములో పీచు, ఖనిజ లవనాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వాముని తినడం వల్ల జలుబు, జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కేవలం తినడానికి మాత్రమే కాకుండా వీటిని వివిధ వంటకాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే ఈ వాము ఆకు డ్రింకు మాదిరిగా చేసుకొని దానిని తాగితే ఎటువంటి నొప్పులు అయినా కూడా దూరమవుతాయి. మరి ఆ వాము డ్రింకును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదట వాము ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి, కొద్దిసేపు తడి లేకుండా ఆరబెట్టాలి. ఆ తర్వాత అల్లాని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, అందులోకి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. అనంతరం దానిని వడగట్టే ముందు కొద్దిగా తేనె నిమ్మరసం కలిపి వడగట్టాలి.

ఈ విధంగా వడకట్టిన ఆ నీటిని వారంలో మూడు సార్లు తాగితే ఎటువంటి కీళ్ల నొప్పులు దరిచేరవు. అంతే కాకుండా వాము ఆకు మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుండెపోటుకు కారణం అయ్యే కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. రక్తపోటును అధిక ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. అలాగే వాములో కాస్త ఆవు నూనె వేసి ఇంట్లో ఒక మూలన పెడితే దోమలు ఆ దరిదాపుల్లోకి కూడా రావు.

Exit mobile version