Site icon HashtagU Telugu

Cyclone Biparjoy: బిపార్జోయ్ తుఫాను ప్రభావం… ఆసుపత్రి జలమయం

Cyclone Biparjoy

Cyclone Biparjoy

Cyclone Biparjoy: దేశంలో బిపార్జోయ్ తుఫాను ప్రభావం కొనసాగుతుంది. గుజరాత్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన బిపార్జోయ్ తుపాను ఇప్పుడు రాజస్థాన్ వైపు మళ్లింది. తాజాగా రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అందులో భాగంగా అజ్మీర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రి జలమయమైంది.

బిపార్జోయ్ తుఫాను తూర్పు-ఈశాన్య రాజస్థాన్ వైపు మళ్లే అవకాశం ఉందని, రాబోయే 12 గంటల్లో అల్పపీడనం తీవ్రతను కొనసాగించవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున తుఫాను బిపార్జోయ్ ప్రభావంతో రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక ప్రాంతాలు భారీ వర్షానికి ప్రభావితమయ్యాయి. ఇక ఆసుపత్రుల్లోనూ నీటి ఎద్దడి కనిపించింది. రాజస్థాన్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అజ్మీర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రి జలమయమైంది.

బిపార్జోయ్ తుఫాను తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర సమాచారం ఇచ్చారు. ఈ మేరకు దక్షిణ రాజస్థాన్ మరియు ఉత్తర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే తుపాను ప్రభావంతో గుజరాత్, రాజస్థాన్‌లలో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దక్షిణ రాజస్థాన్ మరియు ఉత్తర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read More: Sreeja-Kalyan Dev : శ్రీజతో కళ్యాణ్ దేవ్ విడాకులు.. ఈ పోస్ట్ తో క్లారిటీ వచ్చేసినట్టే..