Site icon HashtagU Telugu

Ajit Pawar: ప్రాణం పోయేవరకు ఎన్‌సిపి లోనే ఉంటా: అజిత్ పవార్

Ajith Pawar

Ajith Pawar

Ajit Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సిఎం అజిత్ పవార్ బిజెపిలో చేరనున్నారనే పుకార్లకు తెరపడింది. తాను ఎన్సీపీని వీడి బీజేపీలో చేరడం లేదని స్వయంగా అజిత్ పవార్ స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితం అజిత్ పవార్ అకస్మాత్తుగా ప్రధాని మోదీని పొగిడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడంతో అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నారనే పుకార్లు ఊపందుకున్నాయి. దీనితో పాటు అతను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ను కూడా సపోర్ట్ చేశాడు. కాగా.. పార్టీలో చీలికను నివారించడంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నిన్న సాయంత్రం ముంబైలో ఏర్పాటు చేసిన ఎన్సీపీ ఇఫ్తార్ పార్టీలో మామ శరద్, మేనల్లుడు అజిత్ పవార్ పాల్గొని… ‘మనం కలిసే ఉన్నాం’ అనే సందేశం ఇచ్చారు.

పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది:
అజిత్ పవార్ బీజేపీలో చేరడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అజిత్ పవార్‌తో పాటు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరవచ్చని కూడా చర్చ జరిగింది. అయితే మంగళవారం ఆయన ఈ పుకార్లను ఖండించారు.

చనిపోయే వరకు ఎన్సీపీలోనే ఉంటా: అజిత్ పవార్:
ఈ పుకార్ల తర్వాత అజిత్ పవార్ ఎట్టకేలకు మౌనం వీడారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు మీడియా ముందు హాజరు కావాల్సి వచ్చింది. నేను చనిపోయే వరకు ఎన్సీపీలోనే ఉంటానని అజిత్ పవార్ అన్నారు. నేను నా పార్టీకి, శరద్ పవార్‌కి విధేయుడిని అని కూడా అజిత్ అన్నారు. శరద్ పవార్ ఏది చెబితే అది చేస్తానన్నారు.

అజిత్ బీజేపీలో చేరతారనే చర్చ ఎందుకు?:
కొద్ది రోజుల క్రితం అజిత్ పవార్ ప్రధాని మోదీని, ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2019లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని, తనపై పలు వ్యాఖ్యలు చేసినప్పటికీ తాను ప్రజాదరణ పొందానని ఆయన అన్నారు. ఇది మాత్రమే కాదు, ఈవీఎంలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. ఆ తర్వాత సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను కూడా కలిశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుధీర్ ముంగంటివార్ కూడా ఆయనను ఎన్డీయేలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

Read More: Corona Cases: దేశంలో మరోసారి కరోనా పంజా.. 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు