Party Symbol Vs 2 Pawars : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పేరు, గుర్తు ఎవరివి .. అనే పంచాయితీ త్వరలో ఎన్నికల కమిషన్‌కు చేరుకోనుంది.
దీనిపై ఇప్పటికే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ఎన్నికల సంఘంలో కేవియట్ దాఖలు చేసింది.
దీనికి కౌంటర్ గా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గం కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనుంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పేరు, గుర్తు తమవే అంటూ అజిత్ పవార్ అండ్ టీమ్ కూడా ఎన్నికల సంఘంలో పిటిషన్ వేయనుంది. ఈరోజు(బుధవారం) జరగనున్న ఎమ్మెల్యేల మీటింగ్ తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గం ఈ దిశగా(Party Symbol Vs 2 Pawars) అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర శాసనసభలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం 24 మంది ఎమ్మెల్యేలు అజిత్‌పవార్‌కు, 14 మంది ఎమ్మెల్యేలు శరద్‌పవార్‌కు మద్దతుగా ఉన్నారు. మిగితా ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో.. ఈరోజు ముంబైలో జరిగే అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాల మీటింగ్ తో తేలిపోనుంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేయగా.. అజిత్ పవార్ వర్గం ప్రస్తుత, మాజీ శాసనసభ్యులు, పార్లమెంటేరియన్లు, ఆఫీస్ బేరర్లు, వర్కింగ్ కమిటీ సభ్యులందరికీ నోటీసులు జారీ చేసింది.
Also read : Sitara ghattmaneni : ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో తారలా కనిపిస్తున్న సితార!
కేవియట్ పిటిషన్ అంటే ఏమిటి?
కేవియట్ అనేది లాటిన్ భాష పదం. దీని అర్థం ‘ఒక వ్యక్తిని తెలుసుకోవాలి’. సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) 1908లోని సెక్షన్ 148Aలో కేవియట్ పిటిషన్ గురించి ఉంది. కేవియట్ దాఖలు చేసే వ్యక్తిని కేవియేటర్ అంటారు. ఏదైనా విషయంలో తమపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనే భయంతో వ్యక్తులు ముందుజాగ్రత్త చర్యగా కేవియట్ పిటిషన్ ను దాఖలు చేస్తారు. ఈ పిటిషన్ వేయడం వల్ల కేవియేటర్ కు వ్యతిరేకంగా వచ్చిన ఏదైనా కేసుపై నిర్ణయాలు తీసుకునే ముందు న్యాయస్థానం సహేతుకమైన విచారణను నిర్వహిస్తుంది. కాబట్టి కేవియట్ పిటిషన్ అనేది ఒక హెచ్చరిక సందేశం లాంటిది.