Site icon HashtagU Telugu

IPL 2022: ముంబై పై రాయల్స్ విక్టరీ

Jose Butler

Jose Butler

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆఖరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 రన్స్ చేశాడు. చివర్లో షిమ్రాన్ హెట్‌మైర్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35, సంజూ శాంసన్ 21 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 30 రన్స్ చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా, టైమిల్ మిల్స్ మూడు వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు.

194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ త్వరగానే కెప్టెన్ రోహిత్ శర్మ(10) అన్‌మోల్ ప్రీత్ సింగ్(5) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, ఓపెనర్ ఇషాన్ కిషన్ ధాటిగా ఆడటంతో ముంబై.. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.
ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ ఆర్‌ఆర్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆడుతున్న రెండో మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తనపై ముంబై మేనేజ్‌మెంట్ పెట్టుకున్ననమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. డికాక్, తిలక్ వర్మ ఔటయిన తర్వాత పరుగులు చేసినా ముంబై వరుస వికెట్లు కోల్పోయింది. అయితే డేంజరస్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ భారీ షాట్లు ఆడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో ముంబై విజయానికి 29 పరుగులు అవసరం కాగా.. ఫస్ట్ బాల్ వైడ్ వేసిన సైనీ.. రెండో బాల్ బౌండరీ ఇవ్వడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. కానీ తర్వాతి బంతులను సైనీ డాట్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం లాంఛనమైంది.

Exit mobile version