Airtel: ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. సరికొత్తగా నాలుగు చౌక ప్లాన్లు!

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 05:35 PM IST

ఇదివరకు మొబైల్ ఫోన్లకు రీఛార్జ్ చేసుకోవాలి అంటే 100 లేదా 150 రూపాయల రీఛార్జి చేసుకుంటే నెల రోజులపాటు వచ్చేవి. కానీ రాను రాను ఒక కంపెనీ ని చూసి మరొక కంపెనీలో ఆఫర్లు అని చెబుతూ అధిక మొత్తంలో రీఛార్జ్ ధరలను పెంచుతున్నారు. కాగా ఇప్పట్లో చిన్న మొబైల్ కి అయినా సరే 150 రూపాయల నుంచి రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అలా మొత్తానికి రీఛార్జ్ అంటేనే భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అది ఇదివరకు 30 రోజులు కాలు వ్యవధి రాగా ఇప్పుడు కేవలం 24 లేదా 28 రోజులు మాత్రమే కాల వ్యవధి వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఎయిర్ టెల్ తక్కువగా వినియోగించే చిన్న కస్టమర్లకు దృష్టిలో ఉంచుకొని నాలుగు సరికొత్త ప్లాన్లను తీసుకుని వచ్చింది. అవి రూ.109, రూ.111, రూ. 128, రూ.131. ఇక ఈ ప్లాన్లు వివరాల విషయానికొస్తే.. రూ.109 ప్లాన్ 30 రోజుల కాలవ్యవధి, అలాగే 200 ఎంబి డేటా వస్తుంది. అదేవిధంగా రూ. 99 టాక్ టైం కూడా వస్తుంది. ఇక లోకల్ ఎస్.టి.డి ల్యాండ్ లైన్ కు చేసుకునే వాయిస్ కాల్స్ కు ప్రతి సెకండ్ కు రూ. 2.5 పైసలు చార్జీ పడుతుంది. అలాగే ప్రతి ఎస్ఎంఎస్ కు ఒక రూపాయి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇక రూ.111 ప్లాన్ వివరాల విషయానికి వస్తే.. రూ.109 వ్యాలిడిటీ 30 రోజులు కాగా.. రూ.111 ప్లాన్ వ్యాలిడిటీ కూడా 30 రోజులు వస్తుంది. 109 ప్లాన్ల మాదిరి ప్రయోజనాలు కూడా 111 ఇందులో ఉంటాయి. ఇక రూ.128 ప్లాన్ వివరాల విషయానికొస్తే.. ఈ ప్లాన్ 30 రోజుల కాల వ్యవధి కాగా ఈ ప్లాన్ లో ప్రతి సెకన్ కు చార్జీ రూ. 2.5 పైసలు పడుతుంది. అదే వీడియో కాల్ అయితే ప్రతి సెకన్ కు రూ. 5 పైసలు చార్జీ చెల్లించాలి. మొబైల్ డేటా ఒక ఎంబీకి 50 పైసలు చార్జీ పడుతుంది. లోకల్ ఎస్ఎంఎస్ కు రూపాయి, నేషనల్ ఎస్ఎంఎస్ కు రూ.1.50 చార్జీ చెల్లించాలి. ఇక రూ.131 ప్లాన్ విషయానికి వస్తే..ఈ ప్లాన్ గడువు 30 రోజులు. అంటే ప్రతి నెలా ఒకే తేదీన రీచార్జ్ చేసుకుంటే చాలు. ఇందులో మిగిలిన చార్జీలన్నీ కూడా రూ.128 ప్లాన్ మాదిరే ఉంటాయి.