Site icon HashtagU Telugu

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో విమాన ధరలకు రెక్కలు

Flight

Flight

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత, విమానయాన సంస్థలు కోల్‌కతా నుండి దక్షిణ భారతదేశంలోని భువనేశ్వర్, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, కొచ్చి వంటి నగరాలకు ఛార్జీలను రెండు రెట్లు పెంచాయి. రైలు ప్రమాద ఘటన అనంతరం ఈ నగరాలకు విమానాల ఛార్జీలను విమానయాన సంస్థలు పెంచడం ప్రారంభించాయి. రైలు మార్గం ప్రభావితం కావడంతో ప్రజలు విమాన ప్రయాణం చేస్తుండటంతో సదరు సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి.

కోల్‌కతా నుంచి భువనేశ్వర్‌కు గతంలో రూ.6,000-7,000గా ఉన్న ధర శని, ఆదివారాల్లో రూ.12,000-15,000కి పెరిగింది. అదేవిధంగా విశాఖపట్నంకు శుక్రవారం సాయంత్రం వరకు రూ.5,000-6,000 ఉండగా, శనివారం రూ.14,000-16,000కు పెరిగింది. కోల్‌కతా-హైదరాబాద్‌కు రూ.6,000 నుంచి ప్రారంభమయ్యే ఛార్జీలు రూ.18,000కి చేరాయి. సోమవారం కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్‌కు అతి తక్కువ ధర రూ.15,000. సోమవారం కోల్‌కతా నుంచి చెన్నైకి దాదాపు 20 వేల రూపాయల ధర పలుకుతోంది.

ఇదిలా ఉండగా ఈ సమయంలో విమాన సంస్థలు చార్జీలు పెంపుపై ప్రభుత్వం సీరియస్ అయింది. చార్జీల పెంపుపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని విమానయాన సంస్థలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.