Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా డిజిటల్ మేనియా నడుస్తోంది. తినే ఫుడ్డు నుంచి ప్రతిఒక్కటి కూడా ఆన్లైన్ ద్వారానే నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - July 5, 2022 / 10:00 PM IST

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా డిజిటల్ మేనియా నడుస్తోంది. తినే ఫుడ్డు నుంచి ప్రతిఒక్కటి కూడా ఆన్లైన్ ద్వారానే నడుస్తోంది. ఫుడ్ ఆర్డర్, రైల్వేలు, బస్సు ల టికెట్ బుకింగ్ ఇదంతా కూడా డిజిటల్ గా అవుతుంది. అయితే ఈ డిజిటల్ మీడియాకి అనుగుణంగానే సైబర్ నేరుగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. అదే డిజిటల్ మీడియా అమాయకులను బురిడీ కొట్టించి రకరకాల యాప్ లు లింకులు పంపించి లక్షలకు లక్షలు డబ్బులు కాజేస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే దేశీయ కార్పొరేట్ దిగ్గ‌జ సంస్థ‌లు అయిన టాటా స‌న్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కంపెనీల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేయడానికి పాల్పడుతున్నారు.

తాజాగా ఫ్రాడ్‌స్ట‌ర్ ల జాబితాలోకి టాటా స‌న్స్ ఆధీనంలోని ఎయిరిండియా అలియాస్ మ‌హ‌రాజా వ‌చ్చి చేరింది. తాజాగా ఎయిరిండియా 75వ వార్షికోత్స‌వం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంద‌ర్భంగా ట్రాన్స్‌పోర్ట్ స‌బ్సిడీ అంటూ బూట‌క‌పు మెసేజ్ ప్ర‌జ‌ల్లోకి పంపారు సైబ‌ర్ మోస‌గాళ్లు. ఒక క్వశ్చనీర్ పేపర్ నిపూర్తి చేసిన వారికి విమాణ ప్రయాణ టికెట్ల‌పై రూ.6000 రాయితీ పొందొచ్చు అని ఆ మెసేజ్ యొక్క ఉద్దేశం. అయితే ఈ మెసేజ్ వివిధ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై మెసేజ్ హ‌ల్‌చ‌ల్ చేస్తుండటంతో,ఎయిరిండియా 75వ వార్షికోత్స‌వం పేరిట సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న బూట‌క‌పు మెసేజ్‌పై మ‌హ‌రాజా సంస్థ యాజ‌మాన్యం రియాక్ట్ అయ్యింది.

త‌మ సంస్థ పేరిట వ‌చ్చే ఫ్రాడ్ లింక్‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్రజలకు సూచించింది. మరి ముఖ్యంగా విమాన ప్ర‌యాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అలాంటి ఫ్రాడ్ లింక్‌ల మాయ‌లో ప‌డ వద్దని హెచ్చ‌రించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న ఎయిరిండియాను గ‌తేడాది అక్టోబ‌ర్ 8న వేలం ద్వారా టాటా స‌న్స్ గెలుచుకున్న‌ది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న లాంఛ‌నంగా ఎయిరిండియాను టేకోవ‌ర్ చేసింది.