Air India Flight : అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్.. రష్యా వెళ్ళింది  

ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కు మంగళవారం (జూన్ 6) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (ఏఐ173 ) ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా  రష్యాలోని మగదాన్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని రష్యాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా(Air India Flight) అధికార ప్రతినిధి తెలిపారు.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 10:22 AM IST

ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కు మంగళవారం (జూన్ 6) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (ఏఐ173 ) ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా  రష్యాలోని మగదాన్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని రష్యాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా(Air India Flight) అధికార ప్రతినిధి తెలిపారు. విమానంలో ఉన్న 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. వారిని మరో విమానంలో ఇవాళ (బుధవారం) శాన్ ఫ్రాన్సిస్కో కు ఎయిర్ ఇండియా(Air India Flight) తీసుకెళ్లనుంది. అందులో పెద్ద సంఖ్యలో అమెరికా పౌరులు ఉన్నందున అమెరికా అలర్ట్ అయింది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామంటూ ప్రకటన విడుదల చేసింది.

Also read : Space Spying : చైనా శాటిలైట్ల రోబోటిక్ హ్యాండ్..అమెరికా అలర్ట్

ఇండిగో విమానానికి కూడా సమస్య వచ్చింది

ఇటీవల కాలంలో విమానాలలో సాంకేతిక సమస్యలు పెరిగిపోయాయి. రెండు రోజుల క్రితం అస్సాంలోని  గౌహతి నుంచి దిబ్రూగఢ్ కు బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్య కారణంగా దారి మధ్యలోనే వెనక్కి వచ్చేసింది.  గౌహతిలోని  అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామేశ్వర్‌, ఇద్దరు అస్సాం బీజేపీ  ఎమ్మెల్యేలు సహా 150 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ఇంజిన్‌లో లోపం తలెత్తిందని పైలట్ సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.