Site icon HashtagU Telugu

Air India: సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు ఎయిర్ ఇండియా షాక్…టికెట్లపై రాయితీ తగ్గిస్తూ నిర్ణయం..!!

Air India

Air India

సీనియర్ సిటిజన్లకు, విద్యార్థులు ఎయిర్ ఇండియా షాకిచ్చింది. ఎకానమీ క్లాస్ విమానాల్లో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు అందించే డిస్కౌంట్లను సగానికి తగ్గించినట్లు ప్రకటించింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, ఈ తగ్గింపు నిర్ణయం సెప్టెంబర్ 29 నుండి అమల్లోకి వచ్చింది. సీనియర్ సిటిజన్‌లు విద్యార్థులు సెప్టెంబర్ 29 లేదా ఆ తర్వాత బుక్ చేసుకున్న టిక్కెట్‌లపై 50 శాతానికి బదులుగా 25 శాతం రాయితీని పొందుతారు. ఎకానమీ క్లాస్‌లో బేసిక్ ఛార్జీలపై ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

ఈ ఏడాది జనవరి 27న నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా నియంత్రణను టాటా గ్రూప్ స్వాధీనం చేసుకుంది. ఇతర ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌తో పోలిస్తే విద్యార్థులు, సీనియర్ సిటిజన్‌లకు ఎయిర్ ఇండియాలో బేస్ ఫేర్ డిస్కౌంట్ దాదాపు రెండింతలు తగ్గినప్పటికీ, రాయితీ తగ్గింపును సగానికి తగ్గించే నిర్ణయాన్ని ఎయిర్ ఇండియా సమర్థించింది. ఇక ఇతర వర్గాల ప్రయాణికులకు రాయితీల్లో ఎలాంటి మార్పులేదని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. కాగా ఎయిర్ ఇండియా క్యాన్సర్ రోగులకు 50శాతం రాయితీని ప్రకటిస్తోంది.. వివాహిత సభ్యులు మినహా 2-26 ఏళ్ల వయస్సున్న వ్యక్తులు లబ్ది పొందవచ్చు.