Site icon HashtagU Telugu

తప్పిన పెను ప్రమాదం.. గగనతలంలో ఎదురెదురుగా వచ్చిన ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్ లైన్స్ విమానాలు..!!

Indian Aviation History

Indian Aviation History

ఆకాశంలో పెను ప్రమాదం తప్పింది. నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం, ఎయిర్ ఇండియా విమానం ఆకాశం మధ్యలో ఎదురెదుగా వచ్చాయి. వెంటనే ఫైలట్లు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం నేపాల్‌లో ఎయిరిండియా, నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానాలు గగనతలంలో ఢీకొనబోయాయి. అప్పుడే హెచ్చరిక వ్యవస్థ పైలట్‌లను అప్రమత్తం చేయడంతో వారి సత్వర చర్యలతో పెను ప్రమాదం తప్పింది. ఈ మేరకు అధికారులు ఆదివారం సమాచారం అందించారు.

నేపాల్‌లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ ‘సిఎఎఎన్’ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌లోని ఇద్దరు ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిన ఆరోపణలపై సస్పెండ్ చేసింది. CAAN ప్రతినిధి జగన్నాథ్ నీరులా ఈ సమాచారాన్ని అందించారు. శుక్రవారం ఉదయం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఖాట్మండుకు వస్తున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం, న్యూఢిల్లీ నుంచి ఖాట్మండు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి.

ఎయిరిండియా విమానం 19 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది:

ఎయిరిండియా విమానం 19 వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి వస్తుండగా, నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం ఏకంగా 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోందని నీరులా చెప్పారు. సమీపంలో రెండు విమానాలు ఉన్నాయని రాడార్‌లో చూపడంతో నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం 7,000 అడుగుల ఎత్తుకు దిగిందని అధికార ప్రతినిధి తెలిపారు.

నేపాల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసింది:

దీనిపై విచారణకు పౌర విమానయాన అథారిటీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో కంట్రోల్‌ రూంకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఇద్దరు అధికారులను సీఏఏఎన్ సస్పెండ్ చేసింది. అయితే ఈ ఘటనపై ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు.