Akbaruddin: అక్బరుద్దీన్ కు ఊరట.. వివాదాస్పద వ్యాఖ్యల కేసు కొట్టివేత

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
Akbar Imresizer

Akbar Imresizer

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్‌పై నమోదైన రెండు కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల కిత్రం‌నిర్మల్‌, ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడిన అక్బరుద్దీన్ మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్య లు చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించి చివరికి కొట్టివేసింది. ఈ కేసులో గతంలో అరెస్టైన అక్బరుద్దీన్‌ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. తాజాగా తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు అక్బరుద్దీన్ పై నమోదైన కేసులను కొట్టేస్తూ ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని, కేసు కొట్టివేసినంత మాత్రానా సంబురాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది.

  Last Updated: 13 Apr 2022, 03:27 PM IST