Tamil Nadu : ఉప ప్ర‌తిప‌క్ష నేత ప‌దవి నుంచి ప‌న్నీర్ స్వెల్వం త‌ప్పించాల‌ని కోరుతున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

త‌మిళ‌నాడు అన్నాడీఎంకేలో వ‌ర్గ‌పోరు కొన‌సాగుతుంది. పన్నీర్ సెల్వంను ఉప ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ఆ

  • Written By:
  • Publish Date - September 22, 2023 / 10:38 PM IST

త‌మిళ‌నాడు అన్నాడీఎంకేలో వ‌ర్గ‌పోరు కొన‌సాగుతుంది. పన్నీర్ సెల్వంను ఉప ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పదవికి ఆర్‌బీ ఉదయకుమార్‌ నియామకాన్ని అధికారికంగా గుర్తించాలని కోరుతూ ఏఐఏడీఎంకే సీనియర్ ఎమ్మెల్యేలు సెంగోట్టయన్, దిండిగల్ శ్రీనివాసన్, సెల్లూర్ రాజు, పొల్లాచ్చి జయరామన్, కదంబూర్ రాజులు శుక్రవారం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అప్పారావును కలిశారు. ఏఐఏడీఎంకే స్పీకర్‌కు ఇదే విష‌యంపై ఇప్ప‌టికి మూడు సార్లు క‌లిసి విజ్క్ష‌ప్తి చేశారు. ఇప్ప‌టికే ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామికి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా హోదా ఉంది. అయితే ఉప ప్ర‌తిప‌క్ష నేత‌గా అప్ప‌ట్లో ప‌న్నీర్ సెల్వాన్ని పార్టీ నియ‌మించింది. అయితే జూలై 11, 2023న జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప‌న్నీర్ సెల్వంను పార్టీ నుండి బహిష్కరించారు. దీంతో ఆ త‌రువాత‌ సీనియర్ నాయకుడు RB ఉదయకుమార్‌ను ఉప ప్రతిపక్ష నేతగా నియమించారు.అప్పటి నుంచి ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు ఆర్‌బీ ఉదయకుమార్‌ నియామకాన్ని గుర్తించాల‌ని అసెంబ్లీ లోపల సీటింగ్‌ను మార్చాలని స్పీకర్‌ను కోరుతున్నారు. ఈ విషయంలో స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని ఖండిస్తూ, ఇటీవలి కాలంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. స్పీకర్‌కు ఇచ్చిన తాజా లేఖ‌లో జులై 22, 2023 సాధారణ కౌన్సిల్ సమావేశంలో పార్టీ శ్రేణిలో చేసిన మార్పులను ధృవీకరిస్తూ పోల్ ప్యానెల్ నుండి వచ్చిన కోర్టు ఆదేశాలు, సమాచారాలను ఎఐఎడిఎంకె నాయకులు ఉదహరించారు.