Site icon HashtagU Telugu

Air India Plane Crash: కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ

Former Gujarat Cm Vijay Rup

Former Gujarat Cm Vijay Rup

అహ్మదాబాద్ (Ahmedabad ) నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India flight AI 171 crashed) మంగళవారం మధ్యాహ్నం మేఘనినగర్ సమీపంలో కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ప్రమాద సమయంలో విమానం టేకాఫ్‌ అయిన 30 నిమిషాల్లోనే నియంత్రణ కోల్పోయి 15 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళానికి చెందిన 12 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijaybhai ) కూడా ఉన్నట్లు తెలిసింది. ఆయనతో పాటు పలువురు ప్రముఖ నేతలు కూడా ప్రయాణించినట్లు సమాచారం. రూపానీ గాయపడినట్టు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. విమానం కూలిన ప్రాంతంలోని చెట్లు, నివాసాలు ధ్వంసమై, ముందు భాగం పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బాధితుల పరిస్థితి మరియు ప్రాణనష్టంపై అధికారిక సమాచారం కోసం అధికారులు పనిచేస్తున్నారు.

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రిని ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విమానయాన శాఖ మంత్రి కిన్జరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఎయిర్ ఇండియా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 1:17కు టేకాఫ్ అయిన విమానానికి 1:50కు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను పరిశీలించేందుకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఇక విజయ్ రూపానీ విషయానికి వస్తే..

విజయ్ రూపానీ ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2016 నుండి 2021 వరకూ గుజరాత్ రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. విజయ్ రూపానీ గుజరాత్ రాష్ట్రంలో భార‌తీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ప్రముఖ నేతగా పేరుగాంచారు. ఆయన రాజకీయ జీవితంలో ఆయన విజయయాత్ర రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి గుజరాత్ శాసనసభ సభ్యుడిగా ప్రారంభమైంది. తన విశ్లేషణాత్మక నాయకత్వం, సంక్షేమ పథకాలపై దృష్టితో ఆయన పార్టీ లోపల మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో అభివృద్ధి, పారిశ్రామికతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

విజయ్ రూపానీ రాజకీయ జీవితం ప్రారంభంలోనే విద్యార్థి నాయకత్వం నుంచి ఎదిగారు. బీజేపీతో ఆయన నడిపిన సుదీర్ఘ ప్రయాణంలో వివిధ హోదాల్లో పని చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ పరిపాలనపై ప్రశంసలు పొందినా, కొన్ని కీలక సందర్భాల్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. 2021లో స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసి పార్టీకి నూతన నాయకత్వానికి అవకాశం కల్పించారు.

సాయంత్రం వరకు విమానాశ్రయం మూసివేత

గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరగడంతో ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి టేకాఫ్, ల్యాండింగ్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అటు దుర్ఘటన సమాచారం తెలుసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ బయల్దేరారు.

విమాన ప్రమాదంపై రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవియేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీలను వెంటనే రంగంలోకి దింపినట్లు ట్వీట్ చేశారు. ‘రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. ప్రయాణికులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఘటనా స్థలంలో మెడికల్ ఎయిడ్, రిలీఫ్ సపోర్టు ఏర్పాట్లు చేశాం. ప్రయాణికుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.

కూలిన విమానంలో ఏ దేశంవారు ఎంతమంది ఉన్నారు?

కూలిన విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, ఇద్దరు నవజాత శిశువులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

అహ్మదాబాద్లో నేలకూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్ నడిపినట్లు DGCA వెల్లడించింది. ఆయనకు 8,200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. కోపైలట్ కు 1,100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ATC ప్రకారం మ.1.39 గం.కు విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయింది. వెంటనే ATCకి ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. ఆ తర్వాత ఏటీసీ సంప్రదించినా విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.