Site icon HashtagU Telugu

Cars Gift : ఉద్యోగుల‌కు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన అహ్మదాబాద్‌ ఐటీ కంపెనీ

Cars Imresizer

Cars Imresizer

అహ్మదాబాద్‌కు చెందిన ఐటీ సంస్థ కంపెనీ అభివృద్ధికి సహకరించినందుకు ఉద్యోగులకు కార్లను బహుమతిగా అందజేసింది. సంస్థ‌లో ప‌ని చేస్తున్న 13 మంది ఉద్యోగులకు కార్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చింది. సంవత్సరాలుగా సంస్థ యొక్క లక్ష్యం పట్ల వారి కృషి, అంకితభావానికి ప్రశంసల చిహ్నంగా ఈ గిఫ్ట్ ఇచ్చిన‌ట్లు ఐటీ సంస్థ తెలిపింది. ఈ ఉద్యోగులు కంపెనీని స్థాపించినప్పటి నుండి దానితో అనుబంధం కలిగి ఉన్నారు. వారి కృషి కారణంగా సంస్థ ఈ రోజు కోట్లను సంపాదించగలిగింది. ఉద్యోగులను ఉద్దేశించి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, డైరెక్టర్‌ రమేష్‌ మరాంద్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇస్తున్నామని..కంపెనీ సృష్టించిన సంపదను త‌మ ఉద్యోగులతో పంచుకోవాలని తాము భావించిన‌ట్లు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమేన‌ని.. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఎన్నో చేస్తామ‌ని హామీ ఇచ్చారు.