Punjab Polls: పంజాబ్ లో కౌంటింగ్‌కు ముందే కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జ్యోతిష్యులతో..

మార్చి 10 స‌మీపిస్తున్న కొద్దీ పంజాబ్‌లో పార్టీలకు గుబులు మొద‌ల‌యింది. ఆ రోజు ఓట్ల లెక్కంపు ఉండ‌డంతో ఫ‌లితాలు ఎలా ఉంటాయోన‌న్న అంచ‌నాల్లో ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - March 3, 2022 / 10:24 AM IST

మార్చి 10 స‌మీపిస్తున్న కొద్దీ పంజాబ్‌లో పార్టీలకు గుబులు మొద‌ల‌యింది. ఆ రోజు ఓట్ల లెక్కంపు ఉండ‌డంతో ఫ‌లితాలు ఎలా ఉంటాయోన‌న్న అంచ‌నాల్లో ఉన్నాయి. చాలా మంది అభ్యర్థులు జ్యోతిష్యుల‌ను ఆశ్రయించి, భ‌విష్యత్తును తెలుసుకుంటున్నారు. Congress అయితే విజ‌యంపై ధీమాగా ఉంది. రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని లెక్కలు వేసుకుంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రత్యేకంగా వార్ రూం ఏర్పాటు చేసి పోలింగ్ స‌ర‌ళిని విశ్లేషిస్తోంది. ఎక్కడెక్కడ గెలుస్తామో లెక్కలు క‌ట్టింది. అదే స‌మ‌యంలో ఫిరాయింపుల బెడ‌ద కూడా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తోంది. గ‌తం గెలిచిన కొన్ని రోజుల్లోనే Congress అభ్యర్థుల‌ను ఇతర పార్టీలు ఆక‌ర్షించ‌డం ఆ పార్టీకి అనుభ‌వంలో ఉన్న విష‌యమే. ఇలాంటివి మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.

గెలుస్తార‌ని భావించే అభ్యర్థుల‌ను ముందుగానే త‌మ ప్రభుత్వాలు ఉన్న రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌డ్‌ల‌కు తీసుకువెళ్లి సుర‌క్షితంగా ఉంచ‌నుంది. కౌంటింగ్ మొదలు.. ఫలితాలప్పుడు, ఆ తరువాత కూడా వారిని చాలా జాగ్రత్తగా చూసుకోనుంది. వారి క‌ద‌లిక‌ల‌ను చాలా జాగ్రత్తగా మోన‌ట‌రింగ్ చేయ‌నుంది. వేట‌గాళ్ల నుంచి ర‌క్షించుకోవ‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్యమ‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు అంటున్నారు.

ఇంట‌ర్నల్‌గా జ‌రిపిన స‌ర్వేలు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని, అందువ‌ల్లే ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. మ‌రోవైపు ఆప్ కూడా ఫ‌లితాల‌పై చాలా ధీమాతో ఉంది. ఒక‌వేళ హంగ్ వ‌స్తే ప‌రిస్థితి ఏమిట‌న్నదానిపైనా చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. ఏది జ‌రిగినా త‌మ స‌భ్యలు చేయి జారిపోకూడ‌దంటూ congress ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది.