Site icon HashtagU Telugu

INDIA PM Face Vs Kejriwal : కేజ్రీవాల్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి.. ‘ఇండియా’కు ఆప్ కొత్త డిమాండ్

Arvind Kejriwal

Modi slogans while Delhi CM Arvind Kejriwal speaking in University

INDIA PM Face Vs Kejriwal : కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి మీటింగ్ కు సరిగ్గా ఒకరోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక ప్రకటన చేసింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రకటించాలని కోరింది. ఇండియా కూటమి తరఫున  ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉండాలని ఇటీవల రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఇటీవల కామెంట్ చేసిన నేపథ్యంలో ఆప్ ఈవిధంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది.  ఆప్ జాతీయ ప్రతినిధి ప్రియాంకా కక్కర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ప్రధాని అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రకటిస్తే బాగుంటుందన్నారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ఢిల్లీలో మాత్రం ఆ ప్రభావం కనిపించకపోవడానికి ప్రధాన కారణం కేజ్రీవాల్ పరిపాలనే అని చెప్పారు.  తమ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత తాగునీరు, విద్య, విద్యుత్, మహిళలకు బస్ సర్వీస్‌లు వంటివి ప్రజలను సంతోషపరుస్తున్నాయని ఆమె తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. ఢిల్లీ మిగులు బడ్జెట్ తో ముందుకు సాగుతోందని చెప్పారు. మోడీ సర్కార్ వైఫల్యాలు, విద్యార్హతలు సహా ప్రతి అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధాన అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ప్రియాంకా కక్కర్ కోరారు. అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రధాని అయితే ఇండియా మానుఫాక్చరింగ్ హబ్‌ గా మారుతుందన్నారు.  మన దేశ విద్యార్థులు మనదేశంలోనే చదువునేలా విద్యా వ్యవస్థను డెవలప్ చేసే విజన్ అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఉందని తెలిపారు.

Also read : Putin Agrees To China Visit: చైనా వెళ్లనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్..? అరెస్ట్ వారెంట్ జారీ అయిన తర్వాత తొలి విదేశీ పర్యటన..!

అరవింద్ కేజ్రీవాల్ పార్టీ చేసిన ఈ ప్రకటన ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబై వేదికగా జరగనున్న మీటింగ్ లో కీలక అంశంగా(INDIA PM Face Vs Kejriwal)  మారే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది ? ప్రధాని రేసులో ఉన్న మమతా బెనర్జీ ఎలా రెస్పాండ్ అవుతారు ? అనే దాని ఆధారంగా ఇండియా కూటమి ఫ్యూచర్ నిర్ధారణ అవుతుంది. ఒకవేళ ప్రధాని అభ్యర్థి విషయంలో క్లారిటీకి రాకపోతే చాపకంద నీరులా.. కూటమిలోని పార్టీల మధ్య కోల్డ్ వార్ కొనసాగే ఛాన్స్ ఉంటుంది.