Ghazipur: ఎంపీ అఫ్జల్ అన్సారీ మరియు ముఖ్తార్ అన్సారీలపై నడుస్తున్న 15 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ల కేసులో శనివారం ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ తీర్పుపై స్థానిక ప్రజలు కూడా ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ తన రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచే మొదలైంది. 1985 అసెంబ్లీ ఎన్నికల నుండి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొన్నారు. 1985లో తొలిసారిగా సీపీఐ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. దీని తర్వాత, అతని విజయ పరంపర 1989, 91, 93 మరియు 96 వరకు కొనసాగింది. అప్పుడు ఆయన సమాజ్ వాదీ పార్టీలో కొనసాగారు. 2002 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి చెందిన కృష్ణానంద్ రాయ్ చేతిలో ఆయన ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో 2004లో పార్టీ ఆయనకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన మనోజ్ సిన్హాపై విజయం సాధించారు.
2005 నవంబర్ 29న ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య తర్వాత అతనిపై బలమైన కేసులు నమోదయ్యాయి. కోర్టులో ఎన్నో అభియోగాల అనంతరం ఆయన జైలుకు వెళ్లాడు. జైలుకు వెళ్లే సమయంలో సమాజ్ వాదీ పార్టీతో రాజకీయ విభేదాల కారణంగా 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఘాజీపూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ఘాజీపూర్ ఎంపీగా ఉన్నారు.