Site icon HashtagU Telugu

Srivari Brahmotsavam: రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala Brahmotsavams

Tirumala Brahmotsavams

కరోనా ప్రభావంతో తిరుమల తిరుపతిలో ముఖ్యమైన పూజ కార్యక్రమాలు నిలిచిపోయాయి. భక్తుల సౌకర్యార్థం టీటీడీ కఠిన నియమాలు పాటించింది. అంగరంగ వైభవంగా జరుగాల్సిన ప్రత్యేక పూజలు మొక్కుబడిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత భ‌క్తుల సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలుకానున్నాయి.

సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5 వ‌ర‌కు మాడ వీధుల్లో వేడుకలు ఘనంగా జరగునునాయి. సెప్టెంబరు 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడ సేవ కార్యక్రమాలు విధిగా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.