Site icon HashtagU Telugu

PrakashRaj: ఈ చీతాలను ఎప్పుడు తీసుకొస్తారు.. ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌

Narendra Modi Prakash Raj

Narendra Modi Prakash Raj

అంతరించిపోయిన చీతాల జాతిని తిరిగి దేశంలో ప్రవేశపెట్టారు ప్రధాని మోడీ. నమీబియా నుంచి రప్పించిన 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో పార్క్‌లో శనివారం విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా మోడీ ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ శనివారం రాత్రి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఈ చీతాలను ఎప్పుడు తీసుకొస్తారు’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ మోడీని ప్రశ్నించారు.

తాను చెప్పే చీతాలు ఇవేనంటూ విజరు మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ ఛోక్సీల ఫొటోలను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. అడవుల్లో తిరిగే చీతాలను రప్పించారు.. మరి బ్యాంకుల నుంచి వేలాది కోట్లు రుణాలు తీసుకుని దేశ ప్రజలను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వారిని ఎప్పుడు రప్పిస్తారు? అనే అర్థం వచ్చేలా ప్రకాశ్‌ రాజ్‌ ఆ పోస్ట్‌ను పెట్టారు. జస్ట్‌ ఆస్కింగ్‌ పేరిట బీజేపీ విధానాలను ఆది నుంచి విమర్శిస్తూ వస్తున్న ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.