Site icon HashtagU Telugu

TSRTC: ప్ర‌యాణికుల‌కు షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ.. రిజ‌ర్వేష‌న్ ఛార్జీలు పెంపు

Tsrtc Imresizer

Tsrtc Imresizer

ఏపీలో ఆర్టీసీ బ‌స్ ఛార్జీల పెంచిన రెండురోజుల్లో తెలంగాణ ఆర్టీసీ కూడా ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చింది. తెలంగాణ ఆర్టీసీలో రిజ‌ర్వేష‌న్ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ఉన్న రిజ‌ర్వేష‌న్ ఛార్జీల‌పై అద‌నంగా రూ.10 పెంచింది. దీంతో ప్రయాణీకులకు అదనపు భారం పడింది. ఒక్కో రిజర్వేషన్ పై రూ.20 రూపాయల నుండి 30 రూపాయలకు ఆర్టీసీ పెంచింది. రిజ‌ర్వేష‌న్ ఛార్జీల పెంపుపై ప్ర‌యాణికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తన్నారు.

గత నెలలో టోల్‌ సెస్, టిక్కెట్‌ ఛార్జీల సవరణ, ప్యాసింజర్‌ సెస్‌ ల పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్‌ బస్సుల వరకు ఛార్జీలు పెంచిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.. తాజాగా రిజ‌ర్వేష‌న్ ఛార్జీలను పెంచి మరో భారాన్ని మోపింది. రిజర్వేషన్ చార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసి ఇప్పటి వరకు పెరుగుదలపై అధికారిక ప్రకటన చేయలేదు.

Exit mobile version