Site icon HashtagU Telugu

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది చిన్నారులతో సహా 25 మంది మృతి

Mexico Bus Crash

Road accident

Afghanistan: ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)లో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. మినీ బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు, 12 మంది మహిళలు సహా 25 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్-ఎ-పుల్ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతంలో ప్రయాణికులు వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు సయ్యద్ జిల్లాలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తున్నారు.

మినీ బస్సు డ్రైవర్ కారణం

ప్రమాదానికి మినీ బస్సు డ్రైవర్ కారణమని స్థానిక పోలీసు కమాండర్ ప్రతినిధి దీన్ మహ్మద్ నజారీ ఆరోపించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే మినీ బస్సు లోతైన లోయలో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అనే విషయంపై నజారీ స్పష్టత ఇవ్వలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు సర్వసాధారణం అయ్యాయి. ప్రధానంగా రోడ్ల దుస్థితి, హైవేలపై డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.

Also Read: Kakhovka Incident: ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌ కు మరో ముప్పు.. మునిగిన ఖెర్సన్‌ నగరం

బాంబు పేలుడులో తాలిబన్ డిప్యూటీ గవర్నర్ మృతి

మరోవైపు, తాలిబన్లలో భద్రతా వ్యవస్థ ఇప్పటికీ అలాగే ఉంది. అంతకుముందు రోజు బదక్షన్ ప్రావిన్స్‌కు చెందిన తాలిబాన్ డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న మౌల్వీ నిసార్ అహ్మద్ బాంబు పేలుడులో మరణించారు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని ఫైజాబాద్‌లో చోటుచేసుకుంది. ఫైజాబాద్‌లోని మహాక్మా ప్లాజా వద్ద డిప్యూటీ గవర్నర్‌ కాన్వాయ్‌పై పేలుడు పదార్థాలు నింపిన వాహనం టార్గెట్‌ అయిందని తాలిబన్‌ నేతృత్వంలోని బదక్షన్‌ సమాచార, సాంస్కృతిక విభాగం అధిపతి మౌజుద్దీన్‌ అహ్మదీ తెలిపారు. ఈ ఘటనలో మరో వ్యక్తి మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి.