Site icon HashtagU Telugu

Taliban Rules: తాలిబన్ల బహిరంగ శిక్షలు.. కొనసాగుతున్న అరాచకాలు!

Taliban Rules

Taliban Rules

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్లు అధికారాన్ని దక్కించుకున్న తర్వాత మహిళలపై ఎన్నో ఆంక్షలును విధిస్తూనే ఉన్నారు. మహిళలపై బాలికలపై కఠినమైన ఆంక్షలను విధిస్తూ షరియాను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కేసుల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగ శిక్షలు విధించారు. అయితే ఈ కేసుల్లో భాగంగా పలు నేరాలకు సంబంధించిన మహిళలతో పాటు మొత్తం 19 మందికి కొరడా దెబ్బలతో బహిరంగంగా శిక్ష విధించినట్లు తెలుస్తోంది. కాగా ఇదే విషయాన్ని అక్కడి అధికారి వెల్లడించారు.

షరియా చట్టానికి లోబడే ఈ శిక్షలను అమలు చేసినట్టుగా తాలిబన్లు సమర్ధించుకుంటున్నారు. వ్యభిచారం దొంగతనం అలాగే ఇంటికి పారిపోయిన వారిపై ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ లో 19 మంది పై కొరడా దెబ్బలను జులిపించారని సుప్రీంకోర్టు అధికారి ఆదివారం తెలిపారు. తాలిబన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కొరడా దెబ్బలు జరుగుతున్నట్టుగా ఇది మొదటి అధికారిక ధృవీకరణగా కనిపించింది. అయితే 1990 ల చివరిలో వారి మునిపటి పాలనలో ఈ బృందం తాలిబాన్ కోర్టులలో నేరాలకు పాల్పడిన వారిపై బహిరంగ మరణశిక్షలు, కొరడాలతో కొట్టడం, రాళ్లతో కొట్టడం వంటివి నిర్వహించింది. అయితే గత ఏడాది ఆగస్టు 2021 లో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించిన తర్వాత మహిళలపై ఎన్నో రకాల ఆంక్షలను విధిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆరవ తరగతికి మించి బాలికల విద్యపై నిషేధంతో పాటు హక్కులు, స్వేచ్ఛలను పరిమితం చేశారు. అయితే అన్ని షరియా చట్టాలను అమలు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నాము అంటూ తాలిబాన్ ప్రతినిధి తాజాగా వెల్లడించారు. తాజాగా నవంబర్ 11న ఈశాన్య తకర్ ప్రావిన్స్ లోని తలోఖా నగరంలో పదిమంది పురుషులు అలాగే తొమ్మిది మంది మహిళలపై 39 సార్లు కొరడా దెబ్బలు కొట్టినట్లు సుప్రీంకోర్టు అధికారి అబ్దుల్ రహీం తెలిపారు.