Site icon HashtagU Telugu

Sarkaru Vaari Paata: అందరి చూపు.. మహేశ్ వైపు!

Mahesh

Mahesh

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ విడుదలై వైరల్‌గా మారింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మహేశ్ తనదైన స్టైల్ లో ఆకట్టకున్నారు. మొత్తం మీద ట్రైలర్ అదిరిపోయింది. ప్రస్తుతం Tollwyood పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాకి అనుకూలమైన అంశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు సినిమా విడుదలై రెండేళ్లు కావోస్తోంది. ఆయన అభిమానులు ఎంతగానో సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు RRR, KGF2 పెద్ద హిట్‌లుగా నిలిచాయి. కానీ ఆ సినిమాల్లో రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ అంతగా లేదు.

రొమాన్స్, కామెడీ ప్యాకేజ్‌తో రాధే శ్యామ్ సినిమా ఆకట్టుకుంటుందని భావించారు. కానీ ఎంటర్ టైన్ మెంట్ విషయంలో తేలిపోయింది. ఇక ‘భీమ్లా నాయక్’ కూడా పవర్ ప్యాక్డ్ సీన్స్‌తో వచ్చింది. అందులో కూడా  రెగ్యులర్ ఎంటర్‌టైనర్‌గా కాదు. ఐతే, ట్రైలర్ చూస్తుంటే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా కాలం తర్వాత థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. ఇక సమ్మర్ సీజన్ కూడా కలిసొచ్చింది. మినిమమ్ గ్యారెంటీ కంటెంట్‌తో సినిమా వర్క్ అవుట్ అయితే, మహేశ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. మరి ఫైనల్ గా ఈ సినిమాతో ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version