Adivi Sesh: ‘మేజర్’ మే 27న వస్తున్నాడు!

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Major

Major

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీని తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. సినిమాను సరైన సినిమా సమయంలో విడుదల చేస్తామని అడివి శేష్ ఇటీవల చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వేసవి కానుకగా ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళ భాషలలో మే 27న విడుదల కాబోతోంది.

ఇప్పటికే విడుదల చేసిన టీజన్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ హృదయమా అనే పాటకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మేజర్ సందీప్ బాల్యాన్ని, యవ్వనాన్ని చూపించనున్నారు. ముంబై అటాక్, మేజర్ వీర మరణం వంటి సన్నివేశాలన్నీ ఇందులో చూపించబోతోన్నారు.

శోభితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలను పోషించారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

  Last Updated: 04 Feb 2022, 03:42 PM IST