అడివి శేష్ టైటిల్ రోల్ లో నటించిన మేజర్ మూవీ సమ్మర్ స్పెషల్స్‌లో ఒకటిగా మే 27న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే తేదీన (మే 27)న వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఎఫ్3తో రాబోతోంది. ఈ నేపథ్యంలో మేజర్ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ రెండవ వారం నుండి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే ఒక వారం వేసవి సెలవుల ముందే రిలీజ్ అవుతుండటంతో మేజర్ కు ఫ్లస్ అయ్యే అవకాశాలున్నాయి. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. ఈ పాన్ ఇండియా మూవీలో శేష్ తో పాటు సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.