Site icon HashtagU Telugu

Aditi Rao Hydari:తన బ్యూటీ సీక్రెట్స్ బయటపెట్టిన అదితీరావ్..!!

aditi

aditi

అదితీరావ్ హైదరీ…మలయాళ మూవీతో వెండి తెరకు పరిచయమైంది ఈ అందాల తార. పక్కా హైదరాబాదీ అయిన ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు చాలా సమయం తీసుకుంది. 2018లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన సమ్మోహనం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ అమ్మడు నటించిన తొలి సినిమతోనే కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. తనదైన అందం, సహజ నటనతో అందర్నీ మెప్పించింది. అంతరిక్షం, వి వంటి సినిమాలతో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన అందానికి సంబంధించిన సిక్రెట్ ను చెప్పేసింది.

చూడగానే ఆకట్టుకునే అందం…పాలమీగడలాంటి మెరుపుతో ఉండే అదితీ అందానికి కారణాన్ని వివరించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…సహాజసిద్ధమైన ఉత్పత్తులను వాడటమే తన అందానికి కారణమంటూ చెప్పుకొచ్చింది. షూటింగ్స్ లేని సమయంలో మేకప్ జోలికి వెళ్లదట. బయటకు వెళ్తే…కళ్లకు కాటుక, లిప్ స్టిక్ మాత్రమే ఉపయోగిస్తుందట. ఇక సెల్ఫీలకు, ఫోటోలకు ఫిల్టర్స్ వాడటం అస్సలు ఇష్టం ఉండదట. షూటింగ్ ముగియగానే..ఇంటికి వచ్చి మేకప్ తప్పనిసరిగా తీసేస్తానని చెబుతోంది. నా చర్మం హెల్తీగా…అందంగా ఉండటానికి కారణం ఇంట్లో తయారు చేసిన ఆయిల్స్ రాసుకోవడమేనని చెప్పిందీ ఈ బ్యూటీ.