AP Schools: పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు : మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఏపీలో క‌రోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు.

  • Written By:
  • Publish Date - January 20, 2022 / 08:03 PM IST

ఏపీలో క‌రోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీకి మొదట అంగీకరించారని..

మళ్లీ ఇప్పుడు ఆందోళనలు చేయటం సరికాదన్నారు. వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నా దాని తీవ్రత అంతలా లేదని వెల్లడించారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని ఎక్క‌డైనా పిల్ల‌ల‌కు కోవిడ్ వస్తే ఆ పాఠశాల వరకూ మూసివేసి, శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయని…

కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ వెల్లడించారు. పాఠశాలలకు సెలవులు ఇస్తారని ఎవరూ అనుకోవద్దని .. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే విద్యా సంస్థలను నడిపిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు