Site icon HashtagU Telugu

Adilabad: ఆదిలాబాద్ లో మినీ ఎయిర్ పోర్ట్

Emergency Landing

Emergency Landing

అడవుల జిల్లా అయిని ఆదిలాబాద్ లో త్వరలోనే ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా  పనికిరాని సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన యంత్రాల కోసం టెండరింగ్‌ కు పిలవడంతో.. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రతిపాదిత మినీ-విమానాశ్రయం కేంద్రం నుంచి ఆమోదం పొందడంపై సందడి నెలకొంది. మినీ ఎయిర్‌పోర్టు నిజంగానే మంజూరైతే సిమెంట్‌ ఫ్యాక్టరీకి తెరపడినట్లేనని నిర్వాసితులు భావిస్తున్నారు. అలాగే, విమానాశ్రయానికి దాదాపు 1,550 ఎకరాలు అవసరం కాగా అందుబాటులో ఉన్న భూమి కేవలం 369 ఎకరాలు మాత్రమే. విమానాశ్రయం కోసం సిమెంట్‌ ఫ్యాక్టరీకి చెందిన భూమిని వినియోగిస్తారని భావిస్తున్నారు. ప్రతిపాదిత మినీ ఎయిర్‌పోర్ట్ కోసం ప్రభుత్వ అధికారులు సాధ్యాసాధ్యాల సర్వే నిర్వహించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు.