Adilabad: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో చల్లటి పొగమంచుతో కూడిన వాతావరణం నెలకొంది. దట్టమైన పొగమంచు కారణంగా హైవేలపై వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో రాకపోకలపై ఎఫెక్ట్ పడింది. డ్రైవర్‌లు హెడ్‌లైట్లు వేసుకొని ప్రయాణం చేయాల్సివస్తోంది. జాతీయ రహదారులపై దట్టమైన పొగమంచు ఉండటంతో వాహనదారులు స్లో ప్రయాణం చేస్తున్నారు. ఇక ఉదయం, రాత్రి సమయంలో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికకులు అంటున్నారు.
తెలంగాణ స్టేట్ ప్లానింగ్ డెవలప్‌మెంట్ సొసైటీ (టిఎస్‌పిడిఎస్) ప్రకారం.. ఆదిలాద్ జిల్లాలోని పొచ్చర, నార్నూర్ మరియు బజార్‌హత్‌నూర్‌లో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లాలోనూ దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఇదే పరిస్థితి నెలకొంది. ఇండోర్ పట్టణంలో, ఉదయం 8 గంటలకు, దట్టమైన పొగమంచు చాలా తీవ్రంగా ఉండటంతో జనాలు ఇళ్లకు పరిమితమయ్యారు.