Adani Scam : అదానీని వెంటనే అరెస్టు చేయాలి: పీసీసీ అధ్యక్షుడు మహేష్

రూ.100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సీఎంలను జైలులో వేశారు. మరి రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీపై చర్యలు ఏవి అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

Published By: HashtagU Telugu Desk
Adani should be arrested immediately: PCC president Mahesh

Adani should be arrested immediately: PCC president Mahesh

PCC Chief Mahesh Goud : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదానీపై కేసు పై మాట్లాడుతూ.. అమెరికా అధికారులు గౌతమ్ అదానీ కుంభకోణాన్ని బట్ట బయలు చేశారని.. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదానీ దాదాపు రూ.2వేల కోట్ల మేర లంచాలు పంచారు. ఆయన అవినీతిపై రాహుల్ గాంధీ ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ స్పందించలేదని మహేష్ కుమార్ అన్నారు.

అదానీ పై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపై విచారన జరిపేందుకు తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అదానికీ రూ.వేల కోట్లు రుణాలు ఇచ్చారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అండతో అనేక విమానాశ్రయ కాంట్రాక్టులు దక్కించుకొని అవినీతి సామ్రాజ్యం స్థాపించారు. 2014 తరువాత అదానీ సంపద ఎలా పెరిగిందో చూశాం. రూ.100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సీఎంలను జైలులో వేశారు. మరి రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీపై చర్యలు ఏవి అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

కాగా, అదానీ గ్రూప్‌ 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందే సోలార్ పవర్ ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లను లంచాలు ఇచ్చేందుకు ఆఫర్‌ చేసినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపించింది.

Read Also: Container Hospitals: ఏపీలో కంటైనర్ ఆసుపత్రులు… తొలుత అక్కడే?

  Last Updated: 22 Nov 2024, 04:32 PM IST