Adani Group: సీఎం రేవంత్ తో భేటీ ఆయిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ గౌతమ్‌ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌ సీఈవో కరణ్‌ అదానీ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

Published By: HashtagU Telugu Desk
Adani Revanth

Adani Revanth

Adani Group: తెలంగాణలో ప్రభుత్వం మార్పు ద్వారా ఐటి పరిశ్రమల విషయంలో అనేక మంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనను మెచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కొందరు పారిశ్రామిక ఔత్సాహికులు. తాజాగా అదానీ గ్రూప్ సీఎం రేవంత్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అదానీ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ గౌతమ్‌ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌ సీఈవో కరణ్‌ అదానీ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కరణ్‌ అదానీ మరియు ఆయన బృందంతో కలిసి బుధవారం సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఉన్నారు. తెలంగాణాలో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడుల సమావేశాన్ని నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం మరియు అదానీ గ్రూప్‌ల మధ్య జరిగిన సమావేశం ఫలితాలిస్తుందని భావిస్తున్నారు బిజినెస్ విశ్లేషకులు.

Also Read: CM Revanth: తెలంగాణలో అమర్ రాజా మరిన్ని పెట్టుబడులు, రేవంత్ తో గల్లా జయదేవ్ భేటీ

  Last Updated: 03 Jan 2024, 04:57 PM IST