New Airport : మహా నగరంలో మరో ఎయిర్ పోర్ట్.. 2024లో రెడీ

మహా నగరంలో మరో కొత్త విమానాశ్రయం(New Airport) అందుబాటులోకి రానుంది..నానాటికీ పెరుగుతున్న విమాన ప్రయాణికుల ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
New Airport

New Airport

మహా నగరంలో మరో కొత్త విమానాశ్రయం(New Airport) అందుబాటులోకి రానుంది..

నానాటికీ పెరుగుతున్న విమాన ప్రయాణికుల ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించనున్నారు.

ఔను.. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ ఎయిర్ పోర్ట్ (New Airport) రెడీ అవుతోంది. ఈ కొత్త ఎయిర్ పోర్ట్ నవీ ముంబైలోని ఉల్వే వద్ద ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) మధ్యలో ఉంటుంది.మన దేశంలోని అతిపెద్ద విమానాశ్రయ ఆపరేటర్లలో ఒకటైన అదానీ ఎయిర్‌పోర్ట్స్ ఈ విమానాశ్రయాన్ని నిర్మించి నిర్వహించనుంది.  ఈ విమానాశ్రయం 22 కి.మీ మేర విస్తరించి ఉన్న ముంబై ట్రాన్స్-హార్బర్ లింక్ కి అనుసంధానించబడి ఉంటుంది. ఇది విమానాశ్రయం, ముంబై మహానగరాల మధ్య ప్రధాన రహదారి కనెక్టర్‌గా పనిచేస్తుంది. నాలుగు దశల్లో ఎయిర్ పోర్టును నిర్మించేందుకు ప్రణాళిక రెడీ చేశారు. ఎయిర్ పోర్ట్ మొదటి రెండు దశల పనులు 2024 డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. “ఈ విమానాశ్రయ నిర్మాణ ప్రాజెక్ట్ కోసం ఉద్దేశించిన 1160 హెక్టార్ల భూమిలో సవాళ్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భాగంలో 2 కి.మీ పొడవు, 100 మీటర్ల పొడవున్న కొండ 55 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాతితో ఉంది” అని అధికార వర్గాలు తెలిపాయి.

Also read :Begging At Airport: ఎయిర్‌పోర్ట్‌లో భిక్షాటన చేసిన యువకుడు.. టికెట్ కొనుగోలు చేసి మరీ ఆ పని?

ఎయిర్ పోర్ట్ విశేషాలు ఇవీ..

  • నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1160 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
  •  ఫ్యూల్ ఎఫీషియంట్ గా, పర్యావరణ హితంగా ఉండేలా ఈ ఎయిర్ పోర్ట్ ను డిజైన్ చేయనున్నారు.
  • ఇందులో కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాలే ఉపయోగిస్తారు. విమానాశ్రయం అంతటా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తారు.
  • ఇక్కడ గ్రీన్ ఎలక్ట్రిసిటీని కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇందుకోసం ఎయిర్ పోర్ట్ లోనే సౌర విద్యుత్ ఉత్పత్తులు చేస్తారు.
  • ఈ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ డిజైన్ భారతదేశపు జాతీయ పుష్పం కమలంను తలపించేలా ఉంటుంది.
  Last Updated: 10 Jun 2023, 09:50 AM IST