Site icon HashtagU Telugu

Raashi Khanna At Tirumla: అందాల రాశి.. అన్నం వడ్డించి!

Raashi

Raashi

తిరుమల తిరుపతి దేవస్థానం హీరోహీరోయిన్లకు సెంటిమెంట్ గా మారింది. అందుకే ఏమాత్రం సమయం దొరికినా వేంకటేశ్వరుడి సేవలో తరించడానికి తపిస్తున్నారు. తమ సినిమా విడుదలకు ముందు, ఇతర శుభాకార్యాల (పుట్టినరోజు, పెళ్లి రోజు) సందర్భంగా తిరుమలను దర్శించుకొని వేంకటేశ్వరుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ సినీనటి రాశీఖన్నా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. అనంతరం వకుళామాత అన్నదాన సత్రానికి వెళ్లి అన్నదాన సేవలో పాల్గొన్నారు. రాశీఖన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు.