Site icon HashtagU Telugu

Actress Namitha: నమిత తల్లి కాబోతోంది!

Namitha

Namitha

నటి నమిత తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “సొంతం, సింహా” వంటి చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ ఈ సంవత్సరం చివర్లో తన మొదటి బిడ్డ కు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని ఆమె ఫోటోషూట్ ద్వారా తెలియజేసింది. గర్భవతిగా ఉన్న నమిత తన బేబీ బంప్ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. “మాతృత్వంతో కొత్త జీవితం ప్రారంభించబోతుండటంతో మార్పుకు లోనయ్యాను. నాలో ఏదో కదులుతోంది. కొత్త జీవితం.. కొత్త జీవులు నన్ను పిలుస్తున్నప్పుడు.. నేను కోరుకున్నదంతా నువ్వే.. నేను మీ కోసం చాలా కాలం ప్రార్థించాను.. మీ సున్నితమైన కిక్స్ ను మనసారా ఆస్వాదిస్తున్నా.. ఏదో చెప్పలేని ఫీలింగ్’’ అంటూ రియాక్ట్ అయ్యింది. నమిత ఐదేళ్ల క్రితం చెన్నైకి చెందిన తెలుగు వ్యక్తి వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది.