Site icon HashtagU Telugu

Actor Vijay: తెలంగాణ సీఎంతో…తమిళ స్టార్ హీరో విజయ్ భేటీ..!!

actor vijay CM KCR

actor vijay CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ తో తమిళ హీరో విజయ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన విజయ్…ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. విజయ్ ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్…ఆయన్ను ఘనంగా సన్మానించారు.

అయితే ఈ భేటీ ఏ అంశం ప్రాతిపదికగా జరిగిందన్న సమాచారం లేదు. ఏదైనా ప్రత్యేక అంశంపై చర్చించేందుకే విజయ్ ప్రగతి భవన్ కు వెళ్లారా లేదంటే..హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారా అనే అంశంపై స్పష్టత లేదు.

ప్రగతి భవన్ కు వచ్చిన విజయ్ ను టీఆరెస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. విజయ్ వెంట దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ప్రగతి భవన్ కు వచ్చారు.