Actor Unni Mukundan: మోదీతో భేటీ అయిన మలయాళ నటుడు

మలయాళ సినీ నటుడు ముకుందన్ ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మోదీతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Actor Unni Mukundan

New Web Story Copy (39)

Actor Unni Mukundan: మలయాళ సినీ నటుడు ముకుందన్ ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మోదీతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు.

రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి, కేరళలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కేరళలోని తిరువునంతపురం రైల్వే స్టేషన్ లో జెండా ఊపి వందే భారత్ ఎక్స్ రైలుని ప్రారంభించారు. అలాగే వాటర్ మెట్రోని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కేరళ సంప్రదాయంలో దర్శనమిచ్చారు. కేరళ సాంప్రదాయ వస్త్రధారణలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు ముకుంద తో భేటీ అయ్యారు. కొంత సేపు ఇష్ఠాగోష్టీగా మాట్లాడుకున్నారు. మోదీతో దిగిన ఫోటోలను నటుడు ట్విట్టర్ లో షేర్ చేశాడు.

14 సంవత్సర వయస్సులో మిమ్మల్ని చూశాను. ఇప్పుడు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు ముకుందన్. మీతో భేటీ అవ్వడం నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. మీతో మాట్లాడిన 45 నిమిషాలు ఎప్పటికీ మర్చిపోలేను. మీరిచ్చిన సలహాలు పాటిస్తాను అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే ఈ భేటీలో ప్రధానికి ముకుంద బహుమతి ప్రధానం చేశారు. శ్రీకృష్ణుడు విగ్రహాన్ని మోదీకి బహుకరించారు.

22 సెప్టెంబర్ 1987న ముకుందన్ జన్మించారు. మలయాళంలో నటుడు, నిర్మాత మరియు గాయకుడిగా కొనసాగుతున్నాడు. ముకుందన్ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించాడు.

Read More: YCP-TDP :ద‌ళిత కార్డ్ తీసిన జ‌గ‌న్ !CBN టార్గెట్‌

  Last Updated: 25 Apr 2023, 04:00 PM IST