Actor Suman : రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ప్రజలే – నటుడు సుమన్

రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ముమ్మాటికీ ప్రజలే అని వ్యాఖ్యానించారు

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 08:16 PM IST

సీనియర్ సినీ నటుడు సుమన్ (Suman)..ప్రస్తుత రాజకీయాల(Politics)పై, ఓటర్లపై కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ముమ్మాటికీ ప్రజలే అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా నడుస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా..మరికొన్ని చోట్ల లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు , 25 పార్లమెంట్ స్థానాలకు మే 13 న ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. దీంతో తెలుగు ప్రజలు దృష్టి అంత తెలుగు రాష్ట్రాల ఎన్నికల పైనే ఉంది. తమ పార్టీల అధినేతలు ఎలాంటి హామీలు ఇస్తారు.? ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు..? ఎవరిపై ఎవరు మాటల యుద్ధం చేస్తున్నారు..? ఏ పార్టీని నమ్మొచ్చు..? ఏ పార్టీని ఓడించవచ్చు..? ఇలా అనేక రకాలుగా మాట్లాడుకుంటుంటారు. అలాగే సినిమా ప్రముఖుల ఫై కూడా ఓ కన్నేస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల సమయంలో ఏ నటుడు ఎలా స్పందిస్తారో..? ఏ నటి ఎవరికీ సపోర్ట్ చేస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సినీ ప్రముఖుల మాట్లాడే మాటలు ఓటర్లపై ఎక్కుడ ప్రభావం చూపిస్తుంటాయి. దీంతో కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మాట్లాడాలని , ప్రచారం చేయమని అడుగుతుంటారు. ఇందుకు గాను పెద్ద మొత్తంలోనే డబ్బు కూడా ఇస్తారనుకోండి. రీసెంట్ గా యాంకర్ అనసూయ జనసేన పార్టీ కి మద్దతు పలికిందని చెప్పి నానా హడావిడి చేసారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్..ఎన్నికల ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

ఏపీ రాజకీయాలు తనకు అవసరం లేదన్న సుమన్.. తాను తెలంగాణలో ఉంటున్నాను అని తేల్చి చెప్పారు. రాజకీయ నాయకులు దొంగలు అని ప్రజలు తిడుతున్నారని అని, అయితే, రాజకీయ నాయకులను అవినీతిపరులను చేసింది ప్రజలే అని కామెంట్ చేశారు. అన్ని పార్టీల నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చాలా మార్పులు వస్తాయని సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు బాగుండాలి అంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సుమన్ పిలుపునిచ్చారు.

Read Also : TDP vs YCP : వైపీసీ కుతంత్రాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ మాస్టర్‌ ప్లాన్‌..!

Follow us