నటుడు సోనూసూద్ ఇటీవల సిద్దిపేట జిల్లాలోని దుబ్బతండాలో కనిపించారు. సోనూసూద్ ను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కరోనా సమయంలో ఎంతోమంది పేదలకు, వలస కూలీలకు ఈ హీరో చేయూత అందించారు. దీంతో చాలా మంది దృష్టిలో రియల్ హీరో హోదాను సంపాదించాడు. ఆయన సేవలకు గుర్తింపుకుగాను స్థానికులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాండాను సందర్శిస్తానని గతంలో హామీ ఇచ్చిన సూద్.. అక్కడ ప్రత్యక్షమై అభిమానుల కోరిక తీర్చాడు. స్థానికులకు ఓపికగా సెల్ఫీల కోసం ఫోజులిచ్చారు.
Sonusood Statue: సేవలకు సెల్యూట్.. సిద్దిపేట జిల్లాలో సోనూసూద్ విగ్రహం!

Sonusood