Site icon HashtagU Telugu

Siddharth:సారీ సైనా… జోక్ చేసానంతే

Siddharth Saina

Siddharth Saina

నటుడు సిద్దార్థ్ స్టార్ షట్లర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది.

పంజాబ్‌లో ప్రధాని మోదీకి భద్రత విషయంలో జరిగిన సంఘటనపై స్పందించిన సైనా దేశ ప్రధానికే భద్రత లేకపోతే ఇంకెవరికి ఉంటుందని ట్వీట్ చేశారు. సైనా ట్వీట్ పై సిద్దార్థ్ సెటైర్ వేశారు. సైనాను ఉద్దేశిస్తూ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ చాంపియన్ అంటూ సమాధానమిచ్చాడు.సిద్దార్థ్ కాక్ అనే పదం వాడడంపై అభ్యంతరాలు వస్తున్నాయి. సిద్దార్థ్ ఆ పదం వాడడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. మహిళా కమీషన్ కూడా సిద్దార్థ్ పై చర్యలు తీసుకువడానికి సిద్ధమైంది.

దింతో తన ట్వీట్ పై సిద్దార్థ్ వివరణ ఇచ్చారు. ఎవరిని కించపరిచే, అవమానపరిచే ఉద్దేశం తనకు లేదని సిద్దార్థ్ తెలిపారు. ఒక గొప్ప క్రీడాకారిణిగా సైనా అంటే తనకు ఎంతో గౌరవమని, అయితే సైనా చేసిన ట్వీట్ కి తాను ఒక కామెంట్ చేశానని అది జోక్ మాత్రమేనని సిద్దార్థ్ వివరణ ఇచ్చారు. తాను చేసిన కామెంట్ కొందరు మహిళలకు ఇబ్బంది కలిగించినట్లు తెలిసిందని దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నానని సిద్దార్థ్ ప్రకటించారు.

https://twitter.com/Actor_Siddharth/status/1480962679032324097