Site icon HashtagU Telugu

Maharishi Actor: మహర్షి రైతు ఇకలేరు!

Guruswamy Imresizer

Guruswamy Imresizer

మహర్షి చిత్రంలో మహేష్ బాబు కు వ్యవసాయం నేర్పించే రైతు పాత్రలో నటించి..ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్న నటుడు గురుస్వామి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గురుస్వామి ఈరోజు శుక్రవారం ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ‘మహర్షి’ చిత్రంలో రైతు పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చింది. ప్రేక్షకుల్లో గుర్తింపును సాధించి పెట్టింది. ఈ రోల్‌లోకి ఆయన పరకాయ ప్రవేశం చేసి అందరి చేత కంటతడి పెట్టించారు. అలాంటి నటుడు మృతి చెందడం చిత్రసీమకు తీరని లోటు అని చెప్పాలి. ఈయన మరణ వార్త తెలిసి చిత్రసీమతో పాటు సినీ ప్రేక్షకులు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇక గురుస్వామి కర్నూలు జిల్లా వెల్దుర్తిలో జన్మించారు. విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేశారు. కొన్ని రోజులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముట్టడంతో ఉద్యోగం, నటన అంటూ రెండు పడవలపై ప్రయాణంపై మొదలుపెట్టారు. విజేత ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ తరఫున అనేక నాటకాలు వేశారు. ఈయన చివరగా ‘వకీల్ సాబ్’, ‘A1 ఎక్స్‌ప్రెస్’ తదితర చిత్రాల్లో నటించారు.

Exit mobile version